‘అల’ కొత్త రికార్డ్స్ తో బన్నీ ‘అల వైకుంఠపురములో’

మొత్తానికి ‘అల వైకుంఠపురములో’ సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని ఈ నెల 12వ తేదీన విడుదలై ఈ సినిమా విడుదల నాటి నుండి పాజీటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెడుతుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ వీక్ లో ఈ సినిమా 180 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇక నైజామ్ లో 8 రోజుల్లో ఈ సినిమా 31.86 కోట్లను సాధించింది. అంతేకాదు అల్లు అర్జున్ కెరీర్‌లో అత్యంత వేగంగా 30 కోట్లను రాబట్టిన చిత్రంగా ‘అల వైకుంఠపురములో’ కొత్త రికార్డ్ నమోదు చేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 1 కోటి రూపాయల కలెక్షన్ సాధించిన సినిమాల జాబితాలో కూడా చేరిపోయింది. మరి ఇంకెన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం. ఇక యూఎస్ లో $2.5 మిలియన్ వసూళ్లు దాటివేసిన ఈ మూవీ $3 మిలియన్ వసూళ్లకు దగ్గరవుతుంది. ఇది అల్లు అర్జున్ కు ఇది కూడా తొలి 2 మిలియన్ డాలర్ దాటినా సినిమానే.

ఫస్ట్ వీక్ కలెక్షన్స్

నైజాం – 31.86 కోట్లు
సీడెడ్ – 15.45 కోట్లు
గుంటూరు – 8.58 కోట్లు
వైజాగ్ – 15.01 కోట్లు
ఈస్ట్ – 8.12 కోట్లు
వెస్ట్ – 6.40 కోట్లు
నెల్లూరు – 3.50 కోట్లు
కృష్ణ – 7.40 కోట్లు
ఆంధ్ర +తెలంగాణ – 93.3 షేర్
వరల్డ్ వైడ్ టోటల్ షేర్ – 118. 1 కోట్లు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here