బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

Boyati Srinu Mother Passes Away,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Director Boyati Srinu Mother Passes Away,Director Boyati Srinu Mother No More

బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం కలిగింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బోయపాటి తల్లిగారైన శ్రీమతి బోయపాటి సీతారావమ్మ రాత్రి తుది శ్వాస విడిచారు. తమ స్వగ్రామమైన గుంటూరు జిల్లా పెదకాకానిలోనే ఉంటున్నారు. కాగా ఆమె వయస్సు 80 సంవత్సరాలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న బోయపాటి, తల్లి మరణ ఘటన తెలియగానే తన ఫ్యామిలీతో కలిసి హుటాహుటిన పెదకాకాని చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక రేపు పెదకాకానిలో ఆమె అంత్యక్రియలు జరపనున్నారు. కాగా ఆమె మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన భద్ర సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను, తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఆ తర్వాత పలు హిట్ సినిమాలు అందించిన బోయపాటి… ఈ మధ్య కాస్త వెనుకపడ్డారు. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ తో ఒక సినిమా చేయబోతున్నాడు బోయపాటి.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సినిమా అయినా సక్సెస్ అందిస్తుందో..? లేదో? చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + twenty =