అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. గత మూడు సినిమాల్లో సైలెంట్ గా కూల్ క్యారెక్టర్ చేసిన మహేష్ ను ఈ సినిమాలో అనిల్ రావిపూడి కాస్త మాస్ యాంగిల్ లో చూపించాడు. ఇక తమ హీరోను అభిమానులు అలా చూసి చాలా కాలమే అయింది. దీనితో మహేష్ కామెడీకి, యాక్షన్ కు, ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ చేసిన మాస్ డాన్స్ స్టెప్పులకు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ ప్రభావమే కలెక్షన్స్ పై కూడా చూపిస్తుంది. సాలిడ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోతుంది. మొదటి రోజు 32.64 కోట్ల షేర్ రాబట్టగా.. ఇక రెండో రోజు అల వైకుంఠపురంతో పోటీ తట్టుకుని సుమారు 9.5 కోట్ల షేర్ సాధించి రెండు రోజుల్లో రు. 42 కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
సరిలేరు నీకెవ్వరు 2 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్
నైజాం – 12.70 కోట్లు
సీడెడ్ – 5.44 కోట్లు
గుంటూరు – 5.7 కోట్లు
ఉత్తరాంధ్ర – 5.56 కోట్లు
ఈస్ట్ – 4.04 కోట్లు
వెస్ట్ – 3.18 కోట్లు
కృష్ణా – 3.90 కోట్లు
నెల్లూరు – 1.58 కోట్లు
రెండు రోజుల్లో ఏపీ + తెలంగాణ రాష్ట్రాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ రాబట్టిన షేర్ – 42.1 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























