గ్యాప్ ఇచ్చినా.. మంచి హిట్ కొట్టాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమా నిన్న రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలై నెమ్మదిగా అది సూపర్ హిట్ టాక్ గా మారింది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత బన్నీ – త్రివిక్రమ్ హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ తో మొదటిరోజు దుమ్ము దులిపే కల్లెక్షన్స్ రాబట్టుకుంటుంది. ఒక పక్క సరిలేరు నీకెవ్వరు సినిమా ఉన్నా కూడా.. ఈ సినిమా కలెక్షన్స్ పై ఆ ఎఫక్ట్ ఏ మాత్రం పడలేదు. ప్రతి ఏరియాలో ఈ చిత్రం ద్వారా తన కెరీర్ బెస్ట్ ను సాధించాడు బన్నీ, కృష్ణ, గుంటూరు వంటి ఏరియాల్లో ఆల్ టైమ్ రికార్డును సైతం సొంతం చేసుకున్నాడు. మరి ఏయే ఏరియాలో ఎంత కలెక్షన్ రాబట్టాడో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
మొదటిరోజు ‘అల వైకుంఠపురములో’ షేర్స్
నైజాం – 5.99 కోట్లు
సీడెడ్ – 4.02 కోట్లు
యూఏ – 2.87 కోట్లు
ఈస్ట్ – 2.98 కోట్లు
వెస్ట్ – 2.41 కోట్లు
కృష్ణ – 1.55 కోట్లు
గుంటూరు – 3.41 కోట్లు
నెల్లూరు – 1.29 Cr
టోటల్ ఏపీ+తెలంగాణలో ‘అల వైకుంఠపురములో’ సినిమా టోటల్ షేర్- 24.52 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: