పూజా హెగ్డే ఐరెన్ లెగ్ టు గోల్డెన్ లెగ్

ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.. కొంత మంది ఒక్క నైట్ లో స్టార్ హోదా దక్కించుకోవచ్చు… కొంతమంది ఎన్ని ఏళ్ళు నుండి చేస్తున్నా ఆ పొజిషన్ కు రాకపోవచ్చు. ఒక్కోసారి ముందు ఐరెన్ లెగ్ ట్యాగ్ లైన్ వేసుకొని.. ఆ తర్వాత వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ కూడా వున్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే అదృష్టం వస్తే బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయి అన్న సామెత ఫిలిం ఇండస్ట్రీ కి సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా..? అసలుసంగతేంటంటే.. ఇక్కడ ఒక హీరోయిన్ ను కూడా మొదట ఐరెన్ లెగ్ అనే అన్నారు.. తాను ఏం సినిమా చేసిన హిట్ కాకపోవడంతో ఆఖరికి.. ఆమె ఉంటే సినిమా ప్లాపే అన్న రేంజ్ కి వచ్చారు అందరూ. నిజానికి సినిమా ఫలితం రచయితలు, దర్శకుల చేతుల్లో ఉంటుంది. అయినా సరే.. ఒక హీరోయిన్ కెరీర్ ఆరంభంలో చేసిన రెండు మూడు సినిమాలు పోయాయంటే ఐరెన్ లెగ్ ముద్ర వేసేస్తారు. అలా ఆ ట్యాగ్ లైన్ కు బలైన నేటి ఆ హీరోయిన్ ఎవరో కాదు పూజ హెగ్డే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

‘ముకుందా’, ‘ఒక లైలా కోసం’ చిత్రాలతో హీరోయిన్‌గా తెలుగు వారికి పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. తర్వాత చాలా సినిమాలు చేసింది కానీ అవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఇక్కడ వర్కౌట్ కాదులే అని బాలీవుడ్ వెళ్ళింది. అక్కడ హృతిక్ తో కలిసి ‘మొహంజోదారో’ సినిమా చేసింది అది కూడా ప్లాప్. దీనితో ఈ భామకు ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ ఏసేశారు జనాలు. ఈ క్రమంలో పూజాకు వరంలా వచ్చిపడింది ‘డీజే’. దీంతో పూజా కెరీర్, డీజే ముందు…డీజే తర్వాత అన్నట్లుగా మారిపోయిది. తనపై వచ్చిన కామెంట్స్ ను ఏ మాత్రం పట్టించుకోకుండా.. తన హార్డ్ వర్క్ ను నమ్ముకొని.. వరుస సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు వరుస హిట్లతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.

[custom_ad]

ఒకప్పుడు ఒక్క హిట్ కోసం చూసిన పూజ హెగ్డే వరుసగా ఐదు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. 2018 లో త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ తో హిట్ అందుకున్న పూజ.. ఆ తర్వాత మహేష్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి తో మరో హిట్ అందుకుంది. ఆ తర్వాత హిందీలో ‘హౌస్ ఫుల్4’, ఇక్కడ వరుణ్ తేజ్-హరీష్ శంకర్ దర్సకత్వంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో మరో హిట్ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో సూపర్ హిట్ ను దక్కించుకుంది. అంతేకాదు తన సినిమాలకు ఇప్పుడు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది. ఆలా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. తన హార్డ్ వర్క్ తో ఈ స్థాయి కి చేరుకుంది.

[custom_ad]

ప్రస్తుతం ప్రభాస్ తో, అఖిల్ తో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక మరోపక్క హిందీలో కూడా చేస్తుంది ఈ భామ. ఇలానే ముందు ముందు కూడా తాను వరుస హిట్లతో దూసుకుపోవాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + eleven =