గత ఏడాది సంక్రాంతికి విడుదలైన `వినయ విధేయ రామ`లో జోడీగా అలరించిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని మరోమారు జట్టుకట్టనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తాడని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా.. అది నిజమేనన్నది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అంతేకాదు.. ఇందులో చరణ్ కి జోడీగా కియారా అద్వాని కనిపిస్తుందని టాక్. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్రల మధ్య ఓ పాట కూడా ఉంటుందని వినికిడి. మరి.. ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది.
[custom_ad]
`చిరు 152`లో కియారా నటించడం నిజమే అయితే.. `భరత్ అనే నేను` తరువాత కొరటాల దర్శకత్వంలోనూ, `వినయ విధేయ రామ` అనంతరం చరణ్ కో-స్టార్ గానూ నటించే సినిమా ఇదే అవుతుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























