బ‌న్నీకి మూడోసారీ అచ్చొచ్చిన జ‌న‌వ‌రి 12

Allu Arjun Hits Hat Trick Success With This Lucky Combo, Bunny Hits Hat Trick Success On This Lucky Date, Latest Telugu Movies News, Stylish Star Allu Arjun Hits Hat Trick Success With This Lucky Combo, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

ప‌ద‌హారేళ్ళుగా క‌థానాయ‌కుడిగా రాణిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… త‌న కెరీర్ మొత్త‌మ్మీద మూడే మూడు సార్లు సంక్రాంతి సీజ‌న్ లో సంద‌డి చేశాడు. 2007లో రిలీజైన `దేశ ముదురు`తో తొలిసారి ముగ్గుల పండ‌క్కి సంద‌డి చేసిన బ‌న్నీ… ఆపై ఏడేళ్ళ త‌రువాత మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `ఎవ‌డు`(2014) కోసం అతిథి పాత్ర‌లో అల‌రించాడు. క‌ట్ చేస్తే.. మ‌ళ్ళీ ఆరేళ్ళ అనంత‌రం ఇప్పుడు `అల వైకుంఠ‌పుర‌ములో` అంటూ ముచ్చ‌ట‌గా మూడోసారి సంక్రాంతి వినోదాలు పంచాడు. మ‌రో ఘ‌న‌విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ మూడు సినిమాలు కూడా వేర్వేరు సంవ‌త్స‌రాల్లో ఒకే తేదికి జ‌నం ముందుకొచ్చాయి. ఆ తేదినే.. జ‌న‌వ‌రి 12. ఒక క‌థానాయ‌కుడి తొలి మూడు సంక్రాంతి సినిమాలు ఒకే తేదికి రిలీజ‌వ‌డమే ఒక రేర్ ఫీట్ అయితే.. అవి ఘ‌న‌విజ‌యం సాధించడం మ‌రో అరుదైన విష‌య‌మ‌నే చెప్పాలి. మ‌రి.. మున్ముందు కూడా ఇదే తేదికి బ‌న్నీ సంక్రాంతి చిత్రాలు రిలీజై.. సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాయేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 8 =