‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్, సింగిల్ యాంథమ్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కాగా రష్మికా మందన్న కథానాయికగా నటిస్తుండగా… హెబ్బా పటేల్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. హెబ్బా పటేల్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. మహతి సాగర్ సంగీతమందిస్తున్నాడు. ఫిబ్రవరి 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)