2019 ముగింపు దశకు వచ్చేసింది. మరో ఐదు రోజుల్లో 2020 లోకి అడుగు పెట్టబోతున్నాం. ఇక ఈ ఏడాది ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశాయి. వాటిలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడితే.. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. కొంతమంది హీరోలకు ప్లాప్స్ ఎదురైతే.. కొంతమంది హీరోలకు ఈ ఏడాది కలిసొచ్చింది. ఇక గత శుక్రవారంతో ఈ ఏడాది వచ్చే సినిమాలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది.. కొత్త నెలలో రిలీజ్ కు సినిమాలు సిద్ధమయ్యాయి. మరి కొత్త నెలలో ఎన్ని కొత్త సినిమాల సందడి చేస్తున్నాయో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముందుగా పెద్ద సినిమాల విషయానికొస్తే.. దర్బార్ నుండి ఈ హంగామా మొదలవుతుంది. మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
‘సరిలేరు నీకెవ్వరు’:
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలచేయనున్నారు.
‘అల వైకుంఠపురములో’:
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. హారిక-హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను 2020 సంక్రాంతికి జనవరి 12వ రిలీజ్ చేయనున్నారు.
‘ఎంత మంచివాడవురా’:
సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ హీరో గా తెరకెక్కుతున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘డిస్కోరాజా’:
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘డిస్కోరాజా’. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జనవరి 24వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
‘నిశ్శబ్దం’:
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ‘నిశ్శబ్దం’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాను జనవరి 31వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఇక వీటితోపాటు పలు చిన్న సినిమాలు కూడా రిలీజ్ కు సిద్ధంగా వున్నాయి..
‘అతడే శ్రీమన్నారాయణ’:
సచిన్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా ‘అతడే శ్రీమన్నారాయణ’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని కన్నడంతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను జనవరి 1వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
‘తూటా’:
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఎన్నై నోక్కి పాయిమ్ తోట్ట’. తెలుగులో ఈ సినిమాను ‘తూటా’ టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. జనవరి 1వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
‘ఉత్తర’:
ఎస్ఆర్ తిరుపతి దర్శకత్వంలో శ్రీరామ్, కారుణ్య కాథరిన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘ఉత్తర’ సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వుంది. లైవ్ ఇన్ సి క్రియేషన్స్ , గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ఆర్ తిరుపతి, శ్రీపతి గంగాదాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘హల్ చల్’:
శ్రీపతి కర్రి దర్శకత్వంలో రుద్రాక్ష్ఉత్కమ్ ,ధన్య బాలకృష్ణన్ జంటగా తెరకెక్కుతున్న కామెడీ థ్రిల్లర్ ‘హల్ చల్’. ఈ సినిమా ద్వారా శ్రీపతి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ప్రత్యూష కొల్లూరి సమర్పణ లో శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 3వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
‘రొమాంటిక్’:
అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రొమాంటిక్’. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్న ఈ సినిమాను జనవరి 31 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
‘అశ్వథ్థామ’:
రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సినిమా ‘అశ్వథ్థామ’. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టింది. ఇక ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను జనవరి 31వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఇంకా ‘ఊల్లాల ఊల్లాల’సినిమా ‘చూసి చూడంగానే’, ‘పలాస’ సినిమాలు కూడా కొత్త నెలలోనే రిలీజ్ కు సిద్ధంగా వున్నాయి. మరి ఈ సినిమాల్లో ఏ సినిమాలు హిట్ అవుతాయో.. ఏ సినిమాలు ఫట్ అవుతాయో.. చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: