హీరోల బలహీనతలే – సినిమాకు బలం

Heroes Weakness Concept Working Well In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,2019 Telugu Cinemas,2019 Telugu Movies News,Heroes Weakness Concept Working Well In Telugu Movies,Actors Heroes Concept Working Well In Telugu Films,Heroes Weakness Concept Working Well In Telugu Films

హీరోలో లోపం ఉన్న క‌థ‌లు ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో చాలానే వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు అంటే హీరో అంటే హీరోలాగే ఉండాలి. హీరోయిజం చూపించాలి. కానీ ఇప్పుడు మ‌న హీరోలు కూడా మారిపోయారు. తమ ఇమేజ్‌ను పక్కన పెట్టి సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా హీరోల‌కు లోపం ఉన్న క‌థ‌లే వ‌స్తున్నాయి. అంతేకాదు విభిన్నతను మన ప్రేక్షకులు ఎప్పుడూ కోరుకుంటారు కాబట్టి హీరోలో లోపం కాకుండా.. కంటెంట్ ను చూస్తున్నారు. సినిమాలను హిట్ చేస్తున్నారు. దీనితో హీరోల బలహీనతలే.. సినిమాకు బలంగా మారుతున్నాయి. మరి అలా వచ్చిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఊపిరి – నాగార్జున

నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రధారులుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పీవీపీ సంస్థ నిర్మించిన సినిమా ‘ఊపిరి’. తెలుగుతో పాటు తమిళంలోను విడుదలై ఈ సినిమా విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నాగార్జున మొత్తం వీల్ చైర్ లోనే ఉంటాడు. అయినా కూడా తన కళ్ళతోనే నటించి సినిమాకు విజయం చేకూర్చారు. నాగార్జునగారు ఏ నమ్మకంతో ఈ సినిమా అంగీకరించారో తెలీదు కానీ ఆయన నమ్మకం నిజమైంది. సినిమాలో కంటెంట్ ఉంటే హీరో ఎలా వున్నా సినిమా చూస్తారని నిరూపించారు ప్రేక్షకులు.

రంగస్థలం – రాంచరణ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం గత ఏడాది విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి కూడా విదితమే. 80ల కాలంనాటి ఒక పల్లెటూరి రివేంజ్ డ్రామాను దర్శకుడు సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది ఈసినిమా. ఇక ఈసినిమాకు మెయిన్ పిల్లర్ ఎవరంటే రామ్ చరణ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రామ్ చరణ్ ఈ సినిమాలో చెవిటి వాడిలా నటించి ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నాడు.బెస్ట్ యాక్టర్ గా ‘రాంచరణ్ ‘కి అవార్డు కూడా వచ్చింది.

రాజా ది గ్రేట్ – రవితేజ

మాస్ మహారాజా రవితేజ, యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం రాజా ది గ్రేట్. గ‌త ఏడాది అక్టోబర్ 18న దీపావళి శుభాకాంక్షలతో విడుద‌లైన ఈ చిత్రం అందరి ప్ర‌శంస‌లు అందుకుంది. ఇక ఈ సినిమాలో బ్లైండ్ క్యారెక్టర్ లో నటించిన రవితేజ తన పాత్రతో కామెడీ ని పండించాడు. నాకు క‌న‌ప‌డదు స‌ర్‌, ఇట్స్ లాఫింగ్ టైమ్, జ‌కాస్‌, ఐయామ్ బ్లైండ్‌.. బ‌ట్ ఐయామ్ ట్రైండ్‌, గున్న‌మామిడి సాంగ్ ఇలా త‌దిత‌ర అంశాలు సినిమాని ఓ రేంజ్‌లో నిలిచేలా చేశాయి.

జై లవ కుశ – ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ – బాబీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘జై లవ కుశ’. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాలో తారక్ త్రిపాత్రాభినయం చేశాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మూడు పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. మూడు పాత్రల్లో లవ, కుశ పాత్రలు ఎన్టీఆర్ రెగ్యులర్ గా చేసే పాత్రలే కానీ… జై పాత్ర మాత్రం ఎన్టీఆర్ కు కొత్తే. విలన్ గా చేసిన జై క్యారెక్టర్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. కాస్త నత్తి తో ఎన్టీఆర్ చేసిన విలనిజం సూపర్.

మహానుభావుడు – శర్వానంద్

మారుతి దర్శకత్వంలో శర్వానంద్, మెహ్రీన్ పిర్జాడ జంటగా నటించిన సినిమా మహానుభావుడు. ఈ సినిమా బాగానే హిట్ అయింది. ఇక ఈ సినిమాలో శర్వానంద్ కు వున్న బలహీనత ఏంటో తెలిసిందే. ఓసీడీ డిజార్డర్ తో బాధపడే యువకుడి పాత్రలో నటించిన శర్వానంద్ మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.

భలే భలే మగాడివోయ్ – నాని

మారుతి దర్శకత్వంలో నాని, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా భలే భలే మగాడివోయ్. అప్పటికే వరుస ప్లాప్స్ తో భాదపడుతున్న నాని కి ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో మతిమరుపు క్యారెక్టర్ లో నాని చేసిన కామెడీ మాములు కాదు పీక్స్ అని చెప్పొచ్చు. భ‌లేభ‌లే మగాడివోయ్ సినిమాతో నాని కాస్తా న్యాచుర‌ల్ స్టార్ అయ్యాడు. భ‌లేభ‌లే మ‌గాడివోయ్ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు నాని.

నీవెవరో – ఆదిపినిశెట్టి

హరినాథ్‌ దర్శకత్వంలో కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘నీవెవరో’. ఈ సినిమా మంచి హిట్టే కొట్టింది. ఇక అంధుడి పాత్రలో ఆది పినిశెట్టి చేసిన నటనకు మంచి మార్కులే పడ్డాయి.

మెంటల్ మదిలో – శ్రీవిష్ణు

వైవిధ్యభరితమైన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు శ్రీ విష్ణు. ఈ నేపథ్యంలోనే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీ విష్ణు, నివేదా పేతు రాజ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా మెంటల్ మదిలో. మధ్య తరగతి కుటుంబంలో కనిపించే భావోద్వేగ సన్నివేశాలు, ఆలోచనలను వివేక్ ఆత్రేయ చాలా సున్నితంగా తెరకెక్కించారు ఈ సినిమాలో. ఇక ఈ సినిమాలో ఏ డెసిషన్ కరెక్ట్ గా తీసుకోలేని ప్రతి విషయానికీ కన్‌ఫ్యూజ్‌ అయ్యే పాత్రలో శ్రీ విష్ణు నటన పీక్స్.

మరి ముందు ముందు కూడా మన హీరో లు ఒకే గిరిలో ఉండకుండా ఇలా పలు ప్రయోగాలు చేస్తూ మంచి మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాలని కోరుకుందాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =