‘దర్బార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఖరారు

Darbar Pre Release Event Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Darbar Movie Updates,Darbar Telugu Movie Latest News,Darbar Movie Pre Release Event,Darbar Telugu Movie Pre Release Event Date

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన రజినీ లుక్‌, మోషన్ పోస్టర్లతో పాటు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘దర్బార్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక, తేదీ ఖరారైంది. 2020, జనవరి 3న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామ‌స్ , మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. దర్బార్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను NV ప్రసాద్, UV వంశీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ జనవరి 9న విడుదలకానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 4 =