‘భీష్మ’ నుండి ‘సింగిల్స్ ఆంథమ్’ రిలీజ్ 

Bheeshma Movie First Single Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Bheeshma Movie Updates,Bheeshma Telugu Movie Latest News,Bheeshma Songs,Bheeshma Movie Songs,Bheeshma Telugu Movie Songs

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే…మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం రోమ్ వెళ్ళింది చిత్రయూనిట్. ఈ పాటల షూటింగ్ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తయినట్టే. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సింగిల్స్  ఆంథమ్ పేరుతో లవర్ లేక బాధపడుతున్న నితిన్ లైఫ్ ని వివరించేదిగా ఉంది. గర్ల్ ఫ్రెండ్ లేని లైఫ్ ఎంత బోరింగో తెలిపేలా శ్రీచరణ్ లిరిక్స్ బాగున్నాయి. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడారు. ఇక ఫస్ట్ సాంగ్ తో యూత్ కి మరింత చేరువయ్యారు.

కాగా రష్మికా మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. మ‌హ‌తి సాగ‌ర్ సంగీత‌మందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 20 =