ఈ ఏడాది `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేష్` చిత్రాలతో రెండు వరుస ఘనవిజయాలను అందుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. స్వల్ప విరామం అనంతరం ఈ యువ కథానాయకుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ పాత్రలో నటించబోతున్నాడు. జనవరి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో వరుణ్ కి జోడీగా `దబంగ్ 3` బ్యూటీ సైయీ మంజేక్రర్ (దర్శకనటుడు మహేష్ మంజేక్రర్ కుమార్తె) నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సైయీతో సంప్రదింపులు జరుగుతున్నాయని… త్వరలోనే సైయీ ఎంట్రీపై క్లారిటీ వస్తుందని ఇన్ సైడ్ టాక్. మరి… సల్మాన్ సరసన మురిపించిన సైయీ… వరుణ్ జోడీగానూ అలరిస్తుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: