హీరో ధనుష్ , మేఘఆకాశ్ జంట గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ “ఎన్నై నొక్కి పాయుమ్ తోటా” తమిళ మూవీ నవంబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి వైవిధ్య భరిత చిత్రం గా విమర్శకుల ప్రశంసలు పొందింది. రానా దగ్గుబాటి, శశికుమార్ , సునైనా ముఖ్యపాత్రలలో నటించారు. దర్భుక శివ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో ధనుష్ మూవీస్ కు కోలీవుడ్ తోపాటు టాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. హీరో ధనుష్ నటించిన అనేక తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.”ఎన్నై నొక్కి పాయుమ్ తోటా” మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “తూటా “మూవీ విజయభేరి సంస్థ ద్వారా జనవరి 1వ తేదీ రిలీజ్ కానుంది. ఆ రిలీజ్ డేట్ కు ఒక ప్రత్యేకత ఉంది. ధనుష్ నటించిన తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “రఘువరన్ బి .టెక్ ” మూవీ 5సంవత్సరాల క్రితం జనవరి 1వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























