దక్షిణాది రీమేక్ మూవీస్ లో నటించడం ఇష్టం – సల్మాన్ ఖాన్

Salman Khan Wishes To Act In South Indian Remake Movies,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Salman Khan movies remakes of popular South Movies,South Indian Remake Movies,Bollywood actor Salman Khan Movies

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ , సోనాక్షి సిన్హా జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ , కామెడీ మూవీ “దబాంగ్ 3” డిసెంబర్ 20 వ తేదీ హిందీ, తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ కానుంది. శాండల్ వుడ్ సూపర్ స్టార్ సుదీప్ విలన్ గా నటించారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ , అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్, సఫ్రాన్ బ్రాడ్ కాస్ట్ &మీడియా బ్యానర్స్ పై రూపొందిన “దబాంగ్ 3” మూవీ కి సాజిద్ వాజిద్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“దబాంగ్ 3” మూవీరిలీజ్ సందర్భం గా చిత్ర యూనిట్ చెన్నై లో మీడియా తో సమావేశమయ్యారు. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ .. తాను హీరో గా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “వాంటెడ్ “షూటింగ్ చెన్నై లో జరిగిందని, విక్రమ్ హీరో గా రూపొందిన సేతు మూవీ రీమేక్ “తేరే నామ్ ” మూవీ లో నటించానని , దక్షిణాది మూవీస్ రీమేక్స్ లలో నటించడం ఇష్టమని, దర్శకుడు ప్రభుదేవా మంచి మిత్రుడని, తన తదుపరి మూవీ కూడా ప్రభుదేవా దర్శకత్వంలోనే రూపొందనుందని అన్నారు. ప్రభు దేవా మాట్లాడుతూ .. “దబాంగ్ 3” మూవీ కి తనను సల్మాన్ ఆహ్వానించడం చాలా సంతోషం కలిగించిందని, అన్ని భాషల ప్రేక్షకులను ఈ మూవీ అలరిస్తుందని అన్నారు. ప్రభు దేవా, సల్మాన్ కాంబినేషన్ లో రూపొందిన “వాంటెడ్ “(పోకిరి ), అక్షయ్ కుమార్ తో రౌడీ రాథోడ్ ( విక్రమార్కుడు ) హిందీ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − four =