‘నా పేరు సూర్య’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ‘అల వైకుంఠపురములో’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను, పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత బన్నీ టాలెంటెడ్ డైరెక్టర్స్ సుకుమార్ సినిమాను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు కూడా ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. ఇక వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో బన్నీ మరో సినిమాను కూడా లైన్ లో పట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, వేణుశ్రీరామ్ కాంబినేషన్ లో హీరో బన్నీ చేయాల్సిన సినిమాకు ‘ఐకాన్’ అనే టైటిల్ కూడా అనుకున్నారు.
అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే సినిమా ఆగిపోయిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక ఈ వార్తలపై బన్నీ సన్నిహితుడు బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టారు తప్ప, పూర్తిగా క్యాన్సిల్ చేయలేదని వెల్లడించారు….ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన బన్నీ వాస్ ను ‘ఐకాన్’ గురించి అడుగగా.. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టారు తప్ప, పూర్తిగా క్యాన్సిల్ చేయలేదని వెల్లడించారు. బన్నీకి ఆ కథ చాలా నచ్చిందని, తాను ఎప్పుడో అప్పుడు గ్యాప్ చూసుకొని సినిమా చేస్తానని, ఆ కథ తన కోసం అలానే ఉంచాలని వేణుశ్రీరామ్ ని బన్నీ కోరారని బన్నీ వాస్ వెల్లడించారు. ఎప్పటికైనా బన్నీ ఆ సినిమా చేస్తాడని క్లారిటీ ఇచ్చాడు. మరి సుకుమార్ తో సినిమా అయిపోయిన తర్వాత బన్నీ ఈ సినిమాను చేస్తాడేమో చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























