సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది.అయితే మధ్యలో సాహో సినిమా షూటింగ్, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌జాన్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చాడు.ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ నిర్మించారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం హాలిడే ట్రిప్ లో ఉండటం వల్ల జనవరి నెలాఖరున ఈ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాను ఎలాగైనా పూర్తి చేసి 2020 దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట నిర్మాతలు. దసరా సెలవులకు పది రోజుల ముందే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. రిలీజ్ డేట్ కూడా అతి త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో..
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగపతి బాబు విలన్ గా నటించనున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























