3 చిత్రాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పునరాగమనం

Latest Telugu Movies News, Pawan Kalyan Comeback New Movie Details, Pawan Kalyan Recent News 2019, Power Star Pawan Kalyan Makes A Massive Comeback With 3 Movies, Power Star Pawan Kalyan Upcoming 3 Movies, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

కాలం ఇచ్చే తీర్పుకు ఎవరూ అతీతులు కాదు… ఊహలకందని విజయాలతో , ఊహాతీతమైన అపజయాలతో సాగిపోయే స్టార్స్ జీవితంలో శుక్లపక్షపు వెన్నెల ఉంటుంది… కృష్ణపక్షపు తిమిరం ఉంటుంది. ఆ వెన్నెలను ఈ చీకటిని సమతుల్యం చేసుకోగలిగినప్పుడే ప్రజాబాహుళ్యంలో ఉన్న పాపులారిటీ,చరిష్మా పదిలంగా ఉంటాయి.  ఈ వాస్తవాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంచెం ఎర్లీగానే  రియలైజ్ అయ్యారు. అందుకే రెండేళ్ల  విరామం తరువాత వరుసగా మూడు సినిమాలు ట్రాక్ ఎక్కిస్తూ  పవర్ స్టార్ గా తనకున్న డిమాండ్ ఏమిటో సినీ రాజకీయ వర్గాలకు చెప్పకనే చెప్పబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పారు అన్నదే  ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్న వార్త . అయితే పవన్ కళ్యాణ్ సినిమాల నుండి శాశ్వతంగా నిష్క్రమిస్తారు  అన్న నిర్ణయంపై గతంలో  “ద తెలుగు ఫిలిం డాట్ కాం”- ఆయనకు ఒక బహిరంగ లేఖ రాసింది. ”  ఇక సినిమాలు చేయను..” అని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన పట్ల తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తెలుగు ఫిలిం నగర్ డాట్ కాంలో నేను (జర్నలిస్ట్ ప్రభు ) రాసిన ఆ బహిరంగ లేఖ లోని అంశాలతో  పవన్ అభిమానులు కూడా ఏకీభవించారు.ఇప్పుడు వరుసగా 3  సినిమాలు అంగీకరించడం ద్వారా పవన్ కళ్యాణ్ కూడా ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలతో ఏకీభవించినట్లు అయ్యింది.

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మరలా ” స్టార్ట్ కెమెరా- క్లాప్- యాక్షన్”- అనే సినిమా వాతావరణంలోకి పునఃప్రవేశం చేస్తారన్న అనధికార వార్త  ఫిల్మ్ నగర్ వర్గాలలో సంచలనం రేపుతుంది.  ప్రస్తుతం ఈ పవర్ స్టార్ మూడు  సినిమాలు ట్రాక్ ఎక్కిస్తున్నట్టుగా ఫిలిం నగర్ వర్గాల భోగట్టా.

1) క్రిష్ దర్శకత్వంలో A.M. రత్నం నిర్మించనున్న సినిమా
2) హిందీలో విజయవంతమైన పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తూ ‘నేను లోకల్’ ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ లు సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం,
3) హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ చిత్రం.

అయితే ఈ మూడింటిలో ఏది ముందు.. ఏది వెనుక … ఏ సినిమాకు ఎప్పటి నుండి డేట్స్ కేటాయిస్తారు అన్న వివరాలు తెలియవలసి ఉంది. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు కమిట్మెంట్స్ తో పునఃప్రవేశం చేస్తారన్న వార్త అభిమానుల్లో ఆనందోత్సాహాలను నింపుతుంది.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు “ తెలుగు ఫిలిం నగర్ డాట్ కామ్” రాసిన బహిరంగ లేఖను మరోమారు పునః ప్రచురిస్తున్నాం.ఆ లేఖలో మేము ప్రస్తావించిన అంశాలు అక్షర సత్యాలని మీరు కూడా ఏకీభవిస్తారు.  “ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి” అని మేము చేసిన సూచన  ఫలితమే పవన్ కళ్యాణ్ పునరాగమనం అంటూ ఆ క్రెడిట్  ను మా ఖాతాలో వేసుకోము గానీ ఇప్పుడు జరిగింది మాత్రం అదే. Any how Power Star Pawan Kalyan is back and He will rock అన్నది తధ్యం

(  ఈ నేపథ్యంలో 6 నెలల క్రితం “ ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కం” రాసిన ప్రత్యేక వ్యాసాన్ని మీకోసం మరోమారు ప్రచురిస్తున్నాం)

చిత్ర సన్యాసం కరెక్ట్ కానే కాదు – పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ

ఒక పని చేస్తున్నప్పుడు వేరొక  పని చేయకూడదా?

ఒక వ్యాపకంలో నిమగ్నమైతే ఇంకొక వ్యాపకం పెట్టుకోకూడదా?

ఒకళ్ళు ఒకసారి ఒకే పనికి అంకితమై పోవాలి… అందులోనే మునిగి
పోవాలి? అనే నిబంధన ఏమైనా ఉందా?

పశుపక్ష్యాదులు తప్ప మనిషి అనే ప్రతి ఒక్కడూ మల్టిపుల్ యాక్టివిటీస్ తో మనుగడ సాగించటం మానవ నైజం. సమాజంలో వ్యక్తిగా , కుటుంబంలో సభ్యుడిగా  మనిషి రకరకాల బాధ్యతలను, వ్యాపకాలను
నిర్వహిస్తూ ముందుకు సాగుతుంటాడు. వీటిలో ఏదో ఒక్క బాధ్యతకు మాత్రమే నేను పరిమితం అవుతాను అంటే కుదరదు. తనకు తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే ప్రతి వ్యక్తీ  ఒక  “ఆల్ రౌండర్” పాత్రను పోషిస్తుంటాడు.తనకు ఇష్టం ఉన్నా లేకున్నా మనిషి జీవితంలో యాంత్రికంగా పోషించాల్సిన పాత్రలు చాలానే ఉంటాయి. ఇక ఇష్టపూర్వకంగా అనుకున్నది సాధించాలి అనే పట్టుదలతో మనిషి నిర్దేశించుకునే లక్ష్యాలు కొన్ని ఉంటాయి. ఒక విధంగానే కాదు… బహు విధాలుగా తనను తాను విస్తరించుకోవడం కోసం కొంతమంది పడే తపన, చేసే కృషి, సాధించే లక్ష్యాలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సినీ, వ్యాపార, రాజకీయ, మీడియా ఇత్యాది రంగాలలో ఏకకాలంలో అద్భుత విజయాలను సాధించి అన్ని రంగాలలో దిగ్గజాలుగా, రోల్ మోడల్స్ గా ఎదిగిన ఎంతో మంది ప్రముఖులు మన కళ్లముందు కనిపిస్తునే ఉన్నారు.

కాబట్టి ఒక రంగంలో రాణించాలంటే మరో రంగం నుండి తప్పుకోవాలని, ఒక రంగానికి అంకిత అవ్వటము అంటే మరో రంగాన్ని విస్మరించటం అని అర్థం కానే కాదు…ఆ  అవసరం లేనే లేదు. ముఖ్యంగా తాము ఏ రంగం నుండి వచ్చారో, ఏ రంగం తమను ఇంత వాళ్ళను చేసిందో… ఏ రంగంలో తమ మూలాలు  ఉన్నాయో ఆ రంగాన్ని పూర్తిగా, వదిలేసుకోవటం, వదిలించుకోవటం చాలా … చాలా రాంగ్ డెసిషన్.

ఈ ఉపోద్ఘాతం అంతా ఎవరి గురించో… ఎందు గురించో… ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది.

ఎస్… ఇది పవన్ కళ్యాణ్ గురించిన ప్రస్తావనే.. పవన్ కళ్యాణ్ తొలి చిత్రం నుండి ఆయనతో దశాబ్దాల పరిచయం ఉన్న  ఒక సీనియర్ జర్నలిస్ట్ గా  సూటిగా  అడుగుతున్న ప్రశ్న. రాజకీయాలలో ఉండటం కోసం, రాజకీయాలలో కొనసాగటం కోసం సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఏమిటి? అని మొదటి నుండి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తునే ఉన్నాను.

సినిమా వాళ్లు, సినిమా స్టార్స్, సినిమా దేవుళ్ళు- అన్నదే కదా మీ పట్ల అభిమానానికి, ఆరాధనకు, పిచ్చికి, గ్లామర్ కు కారణం. అలాంటి మీరు  సినిమా అనే ఆ అద్భుత ఆకర్షణ శక్తిని అకారణంగా వదులుకుంటాం అంటారేంటి? సినిమాలు మానేసి వస్తేనే రాజకీయాల్లోకి రండి అని మీ పీక మీద ఎవరైనా కత్తి పెట్టారా ?

సరే… అయిపోయింది ఏదో.. అయిపోయింది.. ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. ఆ ఫలితాల పట్ల మీ స్పందన కూడా బాగుంది… హుందాగా ఉంది. మరో ఎన్నికల సమరానికి మీరు సమాయత్తమవుతూ … అభిమానులను, కార్యకర్తలను సమాయత్తపరచడానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం.

కానీ…కిక్ ఏదప్పా !? కిక్ ఏది ?

అనూహ్యమైన ప్రతికూల ఫలితాలతో నీరసపడ్డ అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు కిక్ ఏది?

మరో ఐదు సంవత్సరాల పాటు పార్టీ చరిష్మా ను, అభిమానుల ఆత్మవిశ్వాసాన్ని,  వ్యాపకాన్ని, హుషారును కొనసాగించటానికి అవసరమైన ఆకర్షణ మీ  దగ్గర ఏముంది?

జయాపజయాలకు అతీతమైన  మైండ్ బ్లోయింగ్ ఫాలోయింగ్ మీకు ఉంది అంటే దానికి కారణం సినిమా.
అలాంటి సినిమాకు తిలోదకాలు ఇచ్చేస్తే మీకు సామాన్యుడికి తేడా ఏముంటుంది?

అయినా  ఐదు సంవత్సరాల పాటు కేవలం రాజకీయాలకే అంకితమై గడపటం మీ వంటి అత్యంత ప్రజాకర్షణ కలిగిన స్టార్ కు వ్యక్తిగతంగానే కాదు… పార్టీ ఉనికి దృష్ట్యా కూడా దుర్భరం.

“వ్యాపక రహితంగా ” ఐదేళ్ల నిరీక్షణ అంత ఈజీ కాదు. అంతేకాదు.. ఈ లోపుల సినిమా అనే సమ్మోహన శక్తి ద్వారా కార్యకర్తలలో, అభిమానులలో ఉత్సాహ, ఉద్రేకాలను పునరుజ్జీవింపచేయాలి . మీరు కూడా రెజువనేట్ కావాలి.

అందుకే …. సకాలంలో నిర్ణయం తీసుకోండి…  తెలుగు చిత్ర పరిశ్రమలో, ప్రేక్షక లోకంలో  మీ చరిష్మా, మీ గ్లామర్, మీ డిమాండ్, యధాతధంగా ఉన్నాయి… సదా పటిష్టంగా ఉంటాయి… కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి.

ఇట్లు

ప్రభు 
ఎడిటర్
ద తెలుగు ఫిల్మ్ నగర్ డాట్ కామ్.

ఇదీ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సినిమాలను నెగ్లెక్ట్ చేయకూడదు… అలా చేయవలసిన అవసరం లేదు అని నొక్కి వక్కాణిస్తూ తెలుగు ఫిలింనగర్ డాట్ కాం రాసిన ప్రత్యేక వ్యాసం.

ఎప్పుడో ఆరు నెలల క్రితం ఈ వ్యాసంలో మేము వ్యక్తం చేసిన ఆకాంక్ష నిజమైనందుకు సంతోషిస్తూ పవన్ కళ్యాణ్ కు, ఆయన అభిమానులకు , ఆయా చిత్రాల దర్శక నిర్మాతలకు శుభాభినందనలు పలుకుతుంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం“.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + sixteen =