మ‌ద‌ర్ సెంటిమెంట్ తో `ఫైట‌ర్`?

Interesting Update About Puri Jagannadh And Vijay Deverakonda Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Puri Jagannadh Interesting Upcoming Projects,Vijay Deverakonda Next Movie Updates,Vijay Deverakonda Latest News 2019

`అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి`… `ఇస్మార్ట్‌` డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కెరీర్ లో ఎంతో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రం. బాక్సింగ్ నేప‌థ్యానికి మ‌ద‌ర్ సెంటిమెంట్ జోడించి తెర‌కెక్కించిన ఈ ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా… అప్ప‌ట్లో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. క‌ట్ చేస్తే… బాక్సింగ్, మ‌ద‌ర్ సెంటిమెంట్ తోనే మ‌రో చిత్రాన్ని రూపొందించ‌బోతున్నాడు పూరి. ఆ సినిమానే… `ఫైట‌ర్`.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జ‌న‌వ‌రిలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. `అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి` త‌ర‌హాలోనే వేస‌విలోనే రిలీజ్ కి ప్లానింగ్ జ‌రుగుతోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే… పూరి త‌న త‌ల్లి వ్య‌క్తిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని `ఫైట‌ర్`లో మ‌ద‌ర్ క్యారెక్ట‌ర్ ని డిజైన్ చేశాడ‌ట‌. ఈ పాత్ర సినిమాకి ఓ హైలైట్ గా నిలుస్తుంద‌ని టాక్. కాగా… ఈ త‌ల్లి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంద‌ని వినికిడి. మ‌రి… నిజ‌జీవిత పాత్ర స్ఫూర్తితో పూరి తెర‌కెక్కించ‌నున్న ఈ ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా ఏ స్థాయిలో అల‌రిస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 1 =