బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తుండగా… గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది. ఓ తమిళ్ దర్శకుడితో అఖిల్ నెక్స్ట్ సినిమా ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా అఖిల్ కార్తికేయ, తమిళ్ డైరెక్టర్ మిత్రన్ తో కలిసి డిన్నర్ పార్టీ కి వెళ్లగా అక్కడ తీసుకున్న ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. అంతే కాదు అఖిల్ తన తర్వాత సినిమాను మిత్రన్ తో చేయబోతున్నట్టు.. అది కూడా
ఓ సూపర్ హీరో తరహా సినిమా అయినట్టు.. ఈ సినిమాలో అఖిల్ కొత్త అవతారంలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి వార్తలైతే వస్తున్నాయి.. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
అంతేకాదు ఇటీవల ‘అ’ దర్శకుడు ప్రశాంత్ వర్మ తో అఖిల్ సినిమా ఉండబోతున్నట్టు టాక్స్ వినిపించాయి. అఖిల్ కి కూడా కథ నచ్చడంతో.. ప్రశాంత్ వర్మ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. మరి ఈ రెండు సినిమాల్లో ఆ సినిమా దఫైనల్ అవుతుందో..? లేక అవి వార్తల్లాగానే మిగిలిపోతాయేమో..? చూడాలి ఎం జరుగుతుందో..!
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: