కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ భాగస్వామ్యం లో నిర్మించడానికి తాను సిద్ధం అంటూ సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దిల్ రాజు ప్రతిపాదనకు తొలి అడుగు పడింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి తో కలసి దర్శకుడు క్రిష్ గమ్యం, కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మించారు. తరువాత నిర్మించిన ఫస్ట్ స్పేస్
ఫిల్మ్ అంతరిక్షం నిరాశ పరిచింది. ఇప్పుడు దిల్ రాజు భాగస్వామ్యంలో నూటొక్క జిల్లాల అందగాడు మూవీ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు సాగర్ దర్శకత్వంలో శ్రీనివాస్ అవసరాల, రుహానీ శర్మ జంటగా రూపొందుతున్న నూటొక్క జిల్లాల అందగాడు మూవీ ఈ రోజు ప్రారంభమయింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. 2020 సంవత్సరం వేసవి లో రిలీజ్ కానున్న ఈ మూవీ కి స్వీకార్ అగస్తి సంగీతం అందిస్తారు. నటీ నటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: