మరోసారి ‘అలా.. మొదలైంది’ కాంబినేషన్?

Actor Nani Next Upcoming Movie News, Director Nandini Reddy New Movie, Latest Telugu Movie News, Nani And Nandini Reddy To Team Up Again, Nani Ready To Start His Next Venture?, Nani to Team up With Nandini Reddy, Natural star Nani Next Movie with Nandini Reddy, Natural Star Nani to Team up With Nandini Reddy, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ లేడీ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు నందినీ రెడ్డి. ప్ర‌స్తుతం త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నారామె. ఇది కూడా ఓ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థాంశంతో తెర‌కెక్కుతుంద‌ని స‌మాచారం. స్వప్న సినిమాస్ పతాకంపై ప్రియాంక దత్, స్వప్న దత్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి మిక్కీ జే మేయ‌ర్ బాణీలు అందించ‌నున్నారు.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో… నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించనున్నాడని తెలుస్తోంది. నాని హీరోగా నటించిన ‘అలా.. మొదలైంది’(2011)తోనే నందినీ రెడ్డి దర్శకురాలిగా తొలి అడుగులు వేసారు. మళ్ళీ 8 ఏళ్ళ గ్యాప్ త‌రువాత‌ నాని, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో సినిమా అంటే… ఆసక్తికరమైన అంశమనే చెప్పాలి. త్వరలోనే నాని ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here