యువ కథానాయకుడు కార్తికేయ హీరోగా అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాణ సారథ్యం లో శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వం లో 90 ఎం ఎల్ మూవీ రూపొందుతున్న తెలిసిందే. ఈ మూవీ లో కార్తికేయ మోడరన్ దేవదాస్ గా నటిస్తున్నారు. ఈ రోజు హీరో కార్తికేయ బర్త్ డే సందర్భంగా 90 ఎం ఎల్ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
90 ఎం ఎల్ మూవీ దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ .. MBA గోల్డ్ మెడలిస్ట్ అయిన దేవదాస్ ఆథరైజ్డ్ డ్రింకర్ గా పాప్యులర్ అవడానికి దారితీసిన పరిస్థితులతో ఆసక్తికరంగా ఈ మూవీ రూపొందుతుందని చెప్పారు. నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ .. ఈ మూవీ కాన్సెప్ట్ కామన్ మాన్ కూడా కనెక్ట్ అవుతుందని, అక్టోబర్ 7వ తేదీ కి టాకీ పార్ట్ పూర్తవుతుందని, మూడు సాంగ్స్ ను యూరప్ లో చిత్రీకరణకు ప్లాన్ చేశామని తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: