హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరో నిఖిల్. ఆ తర్వాత తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కానీ స్వామిరారా సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత కార్తికేయ తో కూడా మంచి హిట్ కొట్టి తనకంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. అయితే కిర్రాక్ పార్టీ అనంతరం నిఖిల్ క్రేజ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. రిలీజ్ అవ్వాల్సిన అర్జున్ సురవరం కూడా అడ్రెస్ లేకుండా పోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం కార్తికేయ సీక్వెల్ కార్తికేయ2 ను లైన్లో పెట్టారు. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. అక్టోబర్ 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు.
కాగా ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల గురించి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి చందు గత ఏడాది తెరకెక్కించిన సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈసారి ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని చూస్తున్నారు. ఈ సినిమాతో తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: