నితిన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. “సింగల్ ఫరెవర్” అన్న ఉప శీర్షికతో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నాడు. ‘వెన్నెల’ కిషోర్, హెబ్బా పటేల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని… సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు చిత్ర కథానాయకుడు నితిన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారని సమాచారం. కాగా… క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మరి… గత కొంతకాలంగా విజయాలకు దూరమైన నితిన్… ‘భీష్మ’తోనైనా సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: