నితిన్ ‘సింగిల్ స్టేటస్’ పై వరుణ్ టీజింగ్..!

Mega Hero Varun Tej Teases Nithiin,Actor Nithiin Wedding News, Bheeshma Movie Release Date, Bheeshma Movie Updates, Bheeshma Telugu Movie Latest News, Bheeshma Telugu Movie Release Date Confirmed, Hero Nithiin Marriage News, Hero Varun Tej About Nithiin Marriage, latest telugu movies news, Nithiin Latest News, Telugu Film News, Telugu Filmnagar, Telugu Movies News 2019, Varun Tej Hints Nithiin Wedding This Christmas, Varun Tej Teases Nithiin About Bheeshma Poster

వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్న సామెత లాగ.. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలన్న కసితో వున్నాడు. ఈ నేపధ్యంలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో తనకు కలిసొచ్చే రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘భీష్మ’ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. భీష్మ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నట్లు నితిన్ తాజాగా సోషల్ మీడియాలో ప్రకటించారు. చేతిలో రోజా పువ్వు పట్టుకుని ఉండే రొమాంటిక్ పోస్టర్ ని పోస్ట్ చేశాడు. ‘చేతిలో పువ్వు.. నా లవర్ గా ఎవరు ఉంటారు.. ఈ క్రిస్టమస్ కి ఒక అమ్మాయిని గిఫ్ట్ గా ఇవ్వాలని శాంటా క్లాజ్ ను కోరుకుంటున్నా’ అని.. భీష్మ చిత్రం మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడానికి ఈ క్రిస్టమస్ కు థియేటర్స్ లోకి వస్తోంది అని నితిన్ తెలిపాడు.

ఇక నితిన్ ట్వీట్ కు వరుణ్ తేజ్ స్పందిస్తూ ‘తథాస్తు భీష్మ’ అని రీట్వీట్ చేసాడు. అయితే ఈ ట్వీట్ తో వరుణ్ నితిన్ ను టీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్ లిస్ట్ లో నితిన్ కూడా వున్నాడు. ఇక ఈ సినిమాలో కూడా నితిన్ సింగిల్ గా వుండే పాత్రలోనే నటిస్తున్నాడు. దీనిత వరుణ్ అటు మూవీ కి ఆల్ డ్ బెస్ట్ చెబుతూనే నితిన్ సింగల్ స్టేటస్ పై కూడా కు కామెంట్ చేస్తూ జోక్ గా కామెంట్ వేసేసాడు.

కాగా ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన కథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.