రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న ‘డిస్కో రాజా’

Disco Raja Gets A Release Date, Disco Raja Movie Release Date Confirmed, Disco Raja Movie Updates, Disco Raja Release Date, Disco Raja Telugu Movie Latest News, Disco Raja Telugu Movie Release Date Locked, latest telugu movies news, Mass Maharaja Ravi Teja Disco Raja Movie Release Date, Ravi Teja Disco Raja Movie Release Date Locked, Telugu Film News, Telugu Filmnagar, Telugu Movies News 2019

మొత్తానికి ‘డిస్కో రాజా’ కు సంభందించిన అప్ డేట్స్ ఇవ్వడంలో వేగం పెంచారు చిత్ర యూనిట్. నిన్ననే ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. వినాయక చవితి పండుగ రోజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు..ఎస్ఆర్టీ ఎంటర్ టైన్మెంట్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. తాజాగా రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరో గా తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్చన్ ఫిల్మ్ గతంలో పలుమార్లు షూటింగ్ కి బ్రేక్ పడినట్లు రూమర్స్ వచ్చినప్పటికీ.. ఇటీవల ఈ సినిమా ఇటీవల శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. నవంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.

ఇక సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో పాటు నాభా నటేష్ మరో హీరోయిన్ గా కనిపించనుంది. ఇంకా సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు… ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.