ఇప్పటీకే తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘విక్రమ్ వేద’ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. విక్రమ్ వేద లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విక్రమ్‌గా మాధవన్, గ్యాంగ్‌స్టర్ వేద పాత్రలో విజయ్‌సేతుపతి నటించారు. అయితే తెలుగు రీమేక్‌లో పోలీస్ ఆఫీసర్ విక్రమ్‌గా రవితేజ కనపడనున్నట్టు వార్తలు వచ్చాయి. మరో హీరోను ఎంపిక చేయాల్సివుందని.. దానికోసం ఎవరిని తీసుకోవాలా అని చిత్ర యూనిట్ చూస్తున్నట్టు టాక్స్ వినిపించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి పాత్రలో యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉండటంతో ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది. అంతే కాదు ప్రస్తుతం కార్తికేయ ప్రతినాయకుడిగా నటించిన సినిమా గ్యాంగ్ లీడర్ సినిమా సెప్టెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫలితం తర్వాత తన నిర్ణయం ఉండబోతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఈ వార్తల్లో ఎంత నిజముందో..
కాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కుతుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను ఒరిజినల్ వెర్షన్ ను నిర్మించిన వై నాట్ స్టూడియోస్ నిర్మించనున్నట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: