`ఐకాన్‌`కి అనిరుధ్ బాణీలు?

Anirudh Ravichander Music For Allu Arjun ICON,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News,Telugu Movies News 2019,Young music director locked for Allu Arjun Icon,Anirudh to compose music for Icon,Anirudh Ravichander back in the game in Tollywood,Young music sensation for Allu Arjun NextSouth Indian music icon Anirudh Ravichander is going to compose

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఐకాన్‌` పేరుతో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత `దిల్‌` రాజు నిర్మించ‌నున్న ఈ యాక్ష‌న్ డ్రామా… ఈ ఏడాది చివ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాకి యువ సంగీత సంచ‌ల‌నం అనిరుధ్ స్వ‌రాలు అందించ‌నున్నార‌ని తెలిసింది. అదే గ‌నుక నిజ‌మైతే… బ‌న్నీ, అనిరుధ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే తొలి చిత్ర‌మిదే అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త‌మిళ‌నాట క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న అనిరుధ్‌… ప్ర‌స్తుతం `ద‌ర్బార్‌`, `ఇండియ‌న్ 2` వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఇక `అజ్ఞాత‌వాసి`తో తెలుగునాట తొలి అడుగులు వేసిన ఈ టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజ‌ర్… ఇటీవ‌ల `జెర్సీ`కి స్వ‌రాలు అందించాడు. అలాగే విడుద‌ల‌కు సిద్ధ‌మైన `నానీస్ గ్యాంగ్ లీడ‌ర్‌`కి కూడా త‌నే బాణీలు అందిస్తున్నాడు. త్వ‌ర‌లోనే `ఐకాన్‌`లో అనిరుధ్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.