‘మీకు మాత్రమే చెప్తా’ అంటున్న విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Announces his New Film in Style,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News,Telugu Movies News 2019,Vijay Deverakonda Upcoming Movie News,Vijay Deverakonda Next Film Updates,Vijay Deverakonda New Film Updates,Vijay Deverakonda Upcoming Movie News

తొలి సినిమా పెళ్లి చూపులు సినిమాతో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత వేరే ఏ సినిమాను మొదలు పెట్టలేదు తరుణ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్ లో నిలదొక్కుకున్న విజయ్ దేవరకొండ తానే నిర్మాతగా.. ‘ది కింగ్ ఆఫ్ హిల్స్’ ప్రొడక్షన్ లో తరుణ్ భాస్కర్ హీరో గా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే తన ట్విట్టర్ ద్వారా త్వరలో తర్వాత ప్రకటన అంటూ ట్వీట్ చేసిన సంగతి గుర్తుండేవుంటుంది కదా. అయితే ఇప్పుడు అది టైటిల్ గురించే అని అర్ధమవుతుంది. ఎందుకంటే ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసారు చిత్రయూనిట్. ‘మీకు మాత్రమే చెప్తా’ అన్న టైటి ఖరారు చేశారు. అంతేకాదు ఈ టైటిల్ ఓ వీడియో ద్వారా రిలీజ్ చేశారు.


కాగా ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ షమ్మిర్ దర్శకత్వం వహిస్తుండగా.. అనసూయ మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. మరో ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − eleven =