నితిన్ ‘భీష్మ’ రిలీజ్ డేట్ ఖరారు

Nithiin Bheeshma Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News,Telugu Movies News 2019,Bheeshma Movie Updates,Bheeshma Telugu Movie Latest News,Bheeshma Movie New Updates,Nithiin Bheeshma Movie Latest News,#Bheeshma,Bheeshma Movie Release Date Locked,Bheeshma Telugu Movie Release Date Confirmed

గత కొద్ది కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. పరాజయాలు ఎదురైనా కూడా ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ తన దూకుడును కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక వెంకీ కుడుముల దర్శకత్వంలో తను భీష్మ సినిమా చేస్తున్న సంగతి తెలసిందే కదా. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవలే రెండో షెడ్యూల్ ను ప్రారంభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. క్రిస్టమస్ పండుగ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

కాగా ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన కథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. దీనితో పాటు మరో రెండు సినిమాలు కూడా నితిన్ చేతిలో ఉన్నాయి. చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమా చేయనుండగా… తనతో ‘ఛల్ మోహన్ రంగా’ చేసిన కృష్ణచైతన్యతోనే మరో సినిమాను కమిట్ అయ్యాడు నితిన్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + eight =