తమన్నా భాటియా… గ్లామర్ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మరాఠి భాషల్లో సందడి చేసిన ఈ మిల్కీ బ్యూటీ… త్వరలో మలయాళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వనుందట. అది కూడా ఓ హారర్ మూవీతో.
ఆ వివరాల్లోకి వెళితే… ‘సెంట్రల్ జైలిలే ప్రేతం’ (సెంట్రల్ జైల్‌లో దెయ్యం అని తెలుగు అర్థం) పేరుతో సంధ్య మీనన్ దర్శకత్వంలో ఓ మలయాళ చిత్రం తెరకెక్కనుంది. మలయాళ, తమిళ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటించే ఈ హారర్ మూవీలో తమన్నా మెయిన్ లీడ్‌గా ఎంపికయ్యిందట. కాగా… ఇప్పటివరకు అనువాద చిత్రాల ద్వారా మాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఇప్పుడు స్ట్రెయిట్ పిక్చర్‌తో అక్కడి ఆడియన్స్‌ను అలరించనుండడం విశేషమనే చెప్పాలి. రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే… తమన్నా తాజా చిత్రం `సైరా నరసింహారెడ్డి` అక్టోబర్ 2న విడుదల కానుంది.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.