`ఇస్మార్ట్ శంకర్` ఘనవిజయం దర్శకుడు పూరీ జగన్నాథ్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒకవైపు ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే… మరో వైపు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయాడు ఈ స్టార్ డైరెక్టర్. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి తెరకెక్కించనున్న ఈ చిత్రానికి పూరి, ఛార్మి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటించే అవకాశముందని సమాచారం. ఇప్పటికే ఈ మేరకు జాన్వి తండ్రి బోనీకపూర్‌తో ఛార్మి సంప్రదింపులు చేస్తోందని టాక్. సో… త్వరలోనే జాన్వి ఎంట్రీపై క్లారిటీ వస్తుందన్నమాట. వాస్తవానికి… గత కొంతకాలంగా విజయ్, జాన్వి కాంబినేషన్‌పై రకరకాల కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు పూరి డైరెక్టోరియల్ కోసం ఈ టాలెంటెడ్ స్టార్స్ జట్టుకట్టబోతుండడం విశేషమే.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
[youtube_video videoid=1ZLTAIfJzvc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
Subscribe to our Youtube Channel
Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.