మరోసారి సెంటిమెంట్‌ను ఫాలో అయిన త్రివిక్ర‌మ్

2019 Latest Telugu Film News, Trivikram follows A sentiment, Trivikram follows A sentiment for Allu Arjun movie, for Allu Arjun movie Trivikram sentiment, Allu Arjun And Trivikram Movie Latest News, Trivikram To Follow A Sentiment For Allu Arjun Film, Trivikram continuing A sentiment, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News
కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమాల‌ను రూపొందించ‌డంలో ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తీరే వేరు. అలాగే… త‌న చిత్రాల‌కి టైటిల్స్ కూడా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసుకుంటారాయ‌న‌. ఈ నేప‌థ్యంలోనే… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో రూపొందిస్తున్న కొత్త చిత్రానికి కూడా ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసాడు త్రివిక్రమ్. అంతేకాదు… టైటిల్ విష‌యంలో త‌న‌కున్న `అ` సెంటిమెంట్‌ని రిపీట్ చేశాడు. ‘అత‌డు’, ‘అత్తారింటికి దారేది’, ‘అ ఆ’, ‘అజ్ఞాత‌వాసి’, ‘అర‌వింద స‌మేత‌’ ఇలా ‘అ’తో మొద‌ల‌య్యే టైటిల్స్‌ని పెట్టి… సింహ‌భాగం విజ‌యాలు అందుకున్న త్రివిక్ర‌మ్‌… `అల వైకుంఠ‌పురములో`తోనూ ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తాడేమో చూడాలి. కాగా… గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు థ‌మన్ సంగీతం అందిస్తున్నాడు. 2020 సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=ikhPF_xq-Hw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here