సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లుక్‌లో మహేష్ కేవలం 25 నిమిషాలే కనిపిస్తాడట. ఆ తరువాత కథ అనూహ్య మలుపులు తీసుకుంటుందని… అక్కడ నుంచి మహేష్ సివిల్ డ్రెస్‌ల్లోనే కనిపిస్తాడని సమాచారం. మరి… ఈ కథనాల్లో ఎంత నిజముందో తెలియాలంటే 2020 సంక్రాంతి వరకు వేచిచూడాల్సిందే. విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్న `సరిలేరు నీకెవ్వరు`ని అనిల్ సుంకర, `దిల్` రాజు, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.