అప్పుడు లేడీ సూపర్ స్టార్, ఇప్పుడు మహానటి – 29 ఏళ్ల తర్వాత

#NationalFilmAwards, 2019 Latest Telugu Film News, 66th National Film Awards, Keerthi Suresh Latest Movie news, Keerthi Suresh Won Film Fair Awards, Mahanati Win Big At 66Th NAtional Film Awards 2019, Mahanati Won National Film Award, National Film Awards 2019, National Film Awards 2019 Mahanati and Awe Win It Big, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Tollywood gets National Award for best actress after 29 years

నేడు ఢిల్లీ వేదికగా 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని.. వాటిలో ఉత్తమమైన సినిమాలకు అవార్డులను ప్రకటించారు. ఇక ఈ అవార్డుల్లో మన తెలుగు సినిమాలకు కూడా పలు అవార్డులు దక్కాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహానటి సావిత్రి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన “మహానటి” చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి(కీర్తి సురేష్), ఉత్తమ కాస్ట్యూమ్ విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. అలాగే దర్శకుడు సుకుమార్,రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “రంగస్థలం” మూవీ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో అవార్డు పొందింది. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ప్రయోగాత్మ చిత్రం “అ”, బెస్ట్ మేకప్, బెస్ట్ వి ఎఫ్ ఎక్స్ విభాగాలలో అవార్డులు గెలుపొందగా, దర్శకుడు రాహుల్ రవీంద్ర డైరెక్షన్ లో సుశాంత్ హీరోగా తెరకెక్కించిన “చిలసౌ” మూవీ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డు పొందడం జరిగింది.

అయితే ఆసక్తికర విషయం ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపు 29 ఏళ్ళ తరువాత కీర్తి సురేష్ కు ఈ అవార్డు దక్కింది. 1990 లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కి కర్తవ్యం సినిమాకు గాను ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు దక్కింది. ఆ తరువాత మళ్ళీ ఎప్పుడు 2019 లో దాదాపు 29 ఏళ్ళకు మహానటి సినిమా ద్వారా కీర్తి సురేష్ కు నేషనల్ అవార్డు రావడం నిజంగా హర్షించదగిన విషయం. మరి ఇందుకుగాను అలనాటి మహానటి కి నేటి మహానటి థాంక్స్ చెప్పుకోవాల్సిందే..!

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eight =