శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, GMB ఎంటర్ టైన్ మెంట్, AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా, లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఆగస్ట్ 9వ తేదీ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు ఫస్ట్ లుక్,టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మహేష్ బాబు లుక్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో జరిగిన విషయం తెలిసిందే. కశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తరువాత మహేష్ బాబు తన తనయుడు గౌతమ్, దర్శకులు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్ లతో క్రికెట్ ఆడి ఎంజాయ్ చేశారు. మహేష్ బాబు బర్త్ డే కు దర్శకుడు అనిల్ ఆ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు. మహేష్ బాబు క్రికెట్ ఆడుతున్న ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: