`సింహా`, `లెజెండ్` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో యాక్షన్ ఎంటర్టైనర్ రానున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం… ఈ క్రేజీ ప్రాజెక్ట్ డిసెంబర్ నుంచి పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య… కె.యస్.రవికుమార్ రూపొందిస్తున్న చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నవంబర్ నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తిచేసుకుంటుంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో… బోయపాటి కాంబినేషన్ మూవీని డిసెంబర్ నుంచి మొదలుపెట్టాలని బాలయ్య భావిస్తున్నారట. అలాగే… 2020 వేసవిలో ఈ సినిమా రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. మరి… `సింహా`, `లెజెండ్` కూడా వేసవి సీజన్లో విడుదలై ఘనవిజయం సాధించిన నేపథ్యంలో… బాలయ్య, బోయపాటి థర్డ్ వెంచర్ కూడా అదే బాట పడుతుందేమో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=-liXVlw8X4s]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: