తమకు అచ్చొచ్చిన ఆగస్టు మాసంలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు కొందరు ప్రముఖులు. ఇప్పటికే ఈ నెలలో విజయాలు అందుకున్న వైనంతో… మరోసారి ఆ ఫీట్‌ని రిపీట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు వారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళ్తే… గత ఏడాది ఆగస్టులో విడుదలై విజయం సాధించిన`చి.ల.సౌ`తో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన రాహుల్ రవీంద్రన్… ఈ ఏడాది `మన్మథుడు 2`(ఆగస్టు 9 విడుదల)తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇక ఐదేళ్ళ క్రితం ఆగస్టు నెలలో విడుదలై విజయం సాధించిన `రన్ రాజా రన్` (2014) తరువాత మళ్ళీ ఈ ఏడాది `రణరంగం`(ఆగస్టు 15 రిలీజ్)తో ఆగస్టు మాసంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు కథానాయకుడు శర్వానంద్. అలాగే నిరుడు `గూఢచారి`గా థ్రిల్ చేసిన అడివి శేష్… ఏడాది గ్యాప్ తరువాత ఇప్పుడు అదే ఆగస్టులో `ఎవరు`(ఆగస్టు 15 విడుదల)తో పలకరించనున్నాడు. అలాగే `రన్ రాజా రాన్`తో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన సుజీత్… ఈ సంవత్సరం `సాహో`(ఆగస్టు 30 విడుదల)తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
ఇప్పటికే ఆగస్టులో విజయాలు చూసిన వీరందరూ… ఈ సారి కూడా ఆ పరంపరని కొనసాగించాలని ఆశిద్దాం.
[youtube_video videoid=Sph4DbS-yDg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: