ఆగస్టు 9… కేరాఫ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌

2019 Latest Telugu Film News, August 9th Blockbuster Day For Tollywood Industry, Blockbuster Day For Tollywood Industry As August 9th, August 9th sentiment For Manmadhudu 2, Manmadhudu 2 Latest Movie News, Nagarjuna Starrer Manmadhudu 2 Movie, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News

ఆగస్టు 9కి, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి మంచి అనుబంధ‌మే ఉంది. ఎందుకంటే… గ‌తంలో ఇదే తేదిన వేర్వేరు సంవ‌త్స‌రాల్లో విడుద‌లైన ప‌లు చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… మ‌హాన‌టుడు యన్టీఆర్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన ‘జగదేకవీరుని కథ’(1961) ఇదే తేదిన విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించింది. అలాగే యన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ క‌ల‌సి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ ‘దేవుడు చేసిన మనుషులు’(1973) కూడా ఇదే రోజున విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీగా నిల‌చింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా రూపొందిన‌ ‘ఛాలెంజ్’(1984) కూడా ఇదే ఆగ‌స్టు 9న రిలీజై మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌చింది. అలాగే చిరు క‌థానాయ‌కుడిగా న‌టించిన మ‌రో చిత్రం ‘కొదమ సింహం’(1990) కూడా ఇదే తేదిన విడుద‌లై మ్యూజిక‌ల్ హిట్ అనిపించుకుంది.

అదేవిధంగా సిద్ధార్థ, జెనీలియా జంటగా రూపొందిన‌ ‘బొమ్మరిల్లు’(2006) కూడా ఇదే తేదిన రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించింది. ఇక ఇదే రోజున‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన‌ ‘జులాయి’(2012) విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌చింది.

మ‌రి… ఇలాంటి నేప‌థ్యం ఉన్న ఆగ‌స్టు 9న ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న నాగార్జున‌ `మ‌న్మ‌థుడు 2` కూడా అదే బాట ప‌డుతుందేమో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=URWUwn8ATzg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =