మొత్తానికి సాహో టీమ్ ఫ్యాన్స్ కు రోజుకో సర్ ప్రైజ్ ఇస్తుంది. నెల రోజుల కౌంట్ డౌన్ స్టార్ అవ్వడంతో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రోజుకో లుక్ ను రిలీజ్ చేస్తుండగా.. ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. నిన్న ట్రైలర్ డేట్ ను ప్రకటించగా ఈ రోజు అది కన్ఫామ్ చేసాడు ప్రభాస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Rising up stronger than ever..It’s almost showtime!💪#Saaho Trailer out tomorrow in four languages. #SaahoTrailerTomorrow pic.twitter.com/f4n6vJZFnO
— UV Creations (@UV_Creations) August 9, 2019
కాగా సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగష్ట్ 30వ తేదీన రిలీజ్ అవుతుంది.
ఇక తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నేషనల్ వైడ్ గా టూర్ వేసే ప్లాన్ లో ఉన్నారు. ఎక్కడిక్కడ షెడ్యూల్స్ ను ఫిక్స్ చేసుకోనున్నారు. ఏపీ తెలంగాణలోని హైదరాబాద్, విజయవాడ కార్యక్రమాల్లో పాల్గొన్న తరువాత.. బెంగుళూరు మరియు చెన్నైలో జరిగే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్నాడట. హిందీలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ, ముంబై, కలకత్తా మరియు పూణే వెళ్లనున్నాడట.
మరి బాహుబలి సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు వున్నాయి. చూద్దాం ఆ అంచనాలను ఈ సాహో అందుకుంటాడో? లేదో?
[youtube_video videoid=8KwZW-wH0PI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: