రెండు పదుల “రాజ కుమారుడు” మహేష్ బాబుకు హార్దిక శుభాకాంక్షలు

2019 Latest Telugu Film News, Telugu Filmnagar Wishes Mahesh Babu on Completion of 20 Years in Tollywood, Mahesh Babu completed 20 Years in Tollywood, Mahesh Babu Received Warm Wishes From Telugu Filmnagar, Glorious Career of Mahesh Babu, Mahesh Babu Completes 20 Years in Tollywood Industry, Mahesh Babu Achievements, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Mahesh Babu Latest Movie News, Telugu Filmnagar Congratulates Mahesh Babu
Telugu Filmnagar Wishes Mahesh Babu on Completion of 20 Years in Tollywood

కాలచక్రంలో అప్పుడే 20 ఏళ్లు దొర్లిపోయాయి. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా  మహేష్ బాబు పరిచయమై 20 ఏళ్లు పూర్తయ్యాయి అంటే నమ్మలేనట్లుగా అనిపిస్తోంది. మహేష్ బాబు హీరోగా ఆయన తొలి చిత్రం “ రాజకుమారుడు” విడుదలై నేటికీ 20 ఏళ్లు పూర్తయ్యాయి.
1999, జూలై 30 న విడుదలైంది రాజకుమారుడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అగ్రనిర్మాత సి. అశ్వినీ దత్ నిర్మించిన ” రాజకుమారుడు” చిత్రం ద్వారా మహేష్ బాబు హీరోగా పరిచయమైనప్పటి ప్రారంభోత్సవ దృశ్యాలు, ఆనాటి కోలాహలం, ఆ సందడి, ఉరకలేసిన అభిమానుల ఉత్సాహం – ఇవన్నీ నిన్న మొన్నటి

ముచ్చట్లుగా కళ్ల ముందు కదలాడుతున్నాయి. కానీ ఇంతలోనే కాల ప్రవాహ వేగంలో 20 వసంతాలు కదిలిపోయాయి.  ఈ 20 ఏళ్లలో హీరోగా మహేష్ బాబు కూడా అనూహ్యంగా, అత్యున్నతంగా ఎదిగారు. తొలిరోజుల్లో మహేష్ బాబు అనే పేరుకు ముందు ” ప్రిన్స్” అనే ప్రిఫిక్స్ ఉండేది. కానీ కాలక్రమంలో అందిపుచ్చుకున్న విజయాల స్థాయిని బట్టి, పెరుగుతున్న ఇమేజ్ ని బట్టి ప్రిన్స్ స్థానంలో ” సూపర్ స్టార్” వచ్చి చేరింది. Yes… now he is the most deserving celebrity for the title Super Star. కాగా ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో మహేష్ బాబుకు జయాపజయాల  మిశ్రమ ఫలితాలు లభించాయి.25 చిత్రాల తన retrospective లో 10 ఘన విజయాలు, 7 యావరేజ్ సక్సెస్ లు , 8 ప్లాపులు కనిపిస్తాయి.

హీరోగా మహేష్ బాబు కెరీర్ ప్రారంభమై నేటికి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన సూపర్ డూపర్ హిట్ చిత్రాలు పదింటిలో మీకు నచ్చిన “the best”  ఏది ? అని సరదాగా ఒక పోల్ గేమ్ నిర్వహిస్తూ మీ పార్టీసిపేషన్ ను ఆహ్వానిస్తున్నాం. రాజకుమారుడు,మురారి, ఒక్కడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి- ఇదీ సూపర్ స్టార్ మహేష్ బాబు 10 సూపర్ హిట్ చిత్రాల జాబితా.
వీటిలో  మీకు “ది బెస్ట్”  అనిపించినది ఏది?

So poll and select the Best of the Super Star .

రెండు పదుల "రాజ కుమారుడు” మహేష్ బాబుకు హార్దిక శుభాకాంక్షలు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here