‘డిస్కో రాజా’ లేటెస్ట్ అప్‌డేట్‌

2019 Latest Telugu Movie News, Disco Raja Movie Shooting updates, Disco Raja Movie to Start shooting in delhi, Ravi Teja Disco Raja Movie Latest Updates, Ravi Teja Disco Raja to be shot in Delhi, Ravi Teja upcoming film Disco Raja To Shoot In Delhi, Telugu Film Updates, Telugu Filmnagar, Telugu star Ravi Teja to start shooting for his upcoming movie Disco Raja In Delhi, Tollywood Cinema News
Ravi Teja Disco Raja Movie Latest Updates

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘డిస్కో రాజా’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ నాయికలుగా నటిస్తుండ‌గా… సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు… యువ సంగీత సంచ‌ల‌నం ఎస్.ఎస్.తమన్ బాణీలు అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… తాజాగా హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం… ఆగస్టు 4 నుంచి ఢిల్లీలో తదుపరి షెడ్యూల్‌ను జరుపుకోనుందని స‌మాచారం. దాదాపు 15 రోజులపాటు సాగే ఈ షెడ్యూల్‌లో `ఇస్మార్ట్‌` బ్యూటీ న‌భా న‌టేష్ కూడా జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. కాగా… ఢిల్లీ షెడ్యూల్ పూర్తైన తరువాత… యూరప్‌కు పయనమ‌వనుందట చిత్ర బృందం. ఇందులో భాగంగా… స్విట్జర్లాండ్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ జరుగుతోందని సమాచారం. ఆపై చకచకా చిత్రీకరణను పూర్తి చేసి… ఈ సంవత్సరాంతంలో ‘డిస్కో రాజా’ని రిలీజ్ చేయనున్నారని టాక్.

[subscribe]

[youtube_video videoid=oFiUUrzcZ2g]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.