ఈరోజు విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తో ఈనె సినిమాల హడావుడి అయిపోయింది. ఇక వచ్చే నెల మొదటి వారం నుండి మళ్లీ హంగామా మొదలుకానుంది. ఆగష్ట్ 2 వ తేదీన గుణ 369 సినిమా రిలీజ్ అవుతుండగా.. ఆగష్ట్ 9వ తేదీన మాత్రం చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో మన్మథుడు 2, కథనం, అశ్వమేథం సినిమాలు ఆగష్ట్ 9 వ తేదీన రిలీజ్ అవ్వనున్నాయి. అయితే మన్మథుడు సినిమాతోో తన సినిమా కూడా రిలీజ్ అవ్వడంపై అనసూయ తన ట్విట్టర్ ద్వారా స్పందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనసూయ తన సినిమా గురించి ట్వీట్ చేస్తూ.. ‘అసలు వీరికి నేను పోటీ ఏంటి పిచ్చికాకపోతే. ట్రైలర్ చాలా బాగుంది. నాకిష్టమైన నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్ సినిమాలో ఉన్నారు. నేను నటించిన ‘కథనం’ సినిమాతో పాటు ‘మన్మథుడు 2’ చూస్తాను’ అని ట్వీట్ చేస్తూ ట్రైలర్ లింక్‌ను పోస్ట్ చేసింది అనసూయ. కాగా ఈ సినిమాకు రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో? ఫట్ అవుతుందో? చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=7yObS9-yydw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: