సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’

Kartikeya Starrer Guna 369 Gets Censored,Telugu Filmnagar,Latest Telugu Movies News,Teluug Film News 2019,Tollywood Cinema Updates,Guna 369 Movie Updates,Guna 369 Telugu Movie Latest News,Guna 369 Movie Censor Report,Guna 369 Telugu Movie Censor Verdict,Guna 369 Movie Completed Censor Formalities,#Guna369
Guna 369 Movie Censor Report

‘ఆర్ఎక్స్ 100’ సినిమా ఘన విజయంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ నటుడు కార్తికేయ. సినిమా జయాపజయాలతో పనిలేకుండా ఈ హీరో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే హిప్పీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ… ఇప్పుడు ‘గుణ 369’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బోయపాటి దగ్గర అసోసియేట్ గా పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆగష్ట్ 2 వ తేదీన రిలీజ్ కానున్న ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను, పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.

కాగా ఈ సినిమాలో కార్తికేయకు జోడిగా.. అనఘ అనే మలయాళ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను జ్ఞాపిక ప్రొడక్షన్స్ మరియు స్ప్రింట్ మీడియా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తిరుమల రెడ్డి – అనిల్ కడియాల నిర్మాతలు. RX 100 సినిమాకు సంగీతం అందించిన చైతన్ భరద్వాజే ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా కార్తికేయకు ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=ILY3zkBenNU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 6 =