5 ఏళ్ళ కెరీర్‌ను పూర్తి చేసుకున్న బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌

2019 Latest Telugu Movie News,Glorious Career of Bellamkonda Sai Srinivas, Glorious Career of The Great Bellamkonda Sai Srinivas in Tollywood, Bellamkonda Sai Srinivas Completes 5 Years in Tollywood, Bellamkonda Sai Srinivas Telugu Movies, 5 Years For Bellamkonda Sai Srinivas in Tollywood Industry, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Bellamkonda Sai Srinivas Completes 5 Years in Tollywood

ఆరడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహంతో యాక్షన్ మూవీస్‌కి ప‌ర్ఫెక్ట్ ఛాయిస్‌లా అనిపిస్తుంటాడు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ యంగ్ హీరో ఇంత‌వ‌ర‌కు ఆరు చిత్రాల్లో నటించగా … దాదాపు ప్రతీ సినిమా యాక్షన్ జానర్‌కు చెందినదే కావడం విశేషం. అలాగే… ఈ ఆరు చిత్రాలలో నాలుగు సినిమాలను వి.వి.వినాయక్‌, భీమనేని శ్రీనివాసరావు, బోయపాటి శ్రీను, తేజ వంటి టాప్ డైరెక్టర్స్ తెరకెక్కించగా… దాదాపు ప్రతీ సినిమాలోనూ స్టార్ హీరోయిన్స్‌తో జట్టుక‌ట్టాడు సాయిశ్రీ‌నివాస్‌. అలాగ‌ని యాక్షన్ సీన్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా… డ్యాన్సుల్లో కూడా తనదైన మార్కును చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు శ్రీనివాస్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… స‌రిగ్గా ఐదేళ్ళ క్రితం ఇదే రోజున (జూలై 25) `అల్లుడు శీను`తో క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేశాడు సాయిశ్రీ‌నివాస్‌. అంతేకాదు… తొలి సినిమాలోనే డ్యాన్సుల‌తో, ఫైట్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో స‌మంత నాయిక‌గా న‌టించ‌గా… త‌మ‌న్నా ప్ర‌త్యేక గీతంలో మెరిసింది. నేటితో ఐదేళ్ళ న‌ట‌నా ప్ర‌స్థానాన్ని పూర్తిచేసుకుంటున్న సాయిశ్రీ‌నివాస్‌… మున్ముందు మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల్లో న‌టిస్తూ కెరీర్‌లో ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.

[subscribe]

[youtube_video videoid=08Fg-1DCHVs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − nine =