తెలంగాణ స్లాంగ్ మీరు మెచ్చిన హీరో..?

Which Heroes Telangana Slang You Liked The Most?,2019 Latest Telugu Movie News, Another Star Hero To Speak In Telangana Slang, Telangana Slang by Another Star Hero, Telangana Slang Movies, Telangana Slang Trend by Star Hero, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Tollywood Star Hero Speaking Telangana
Which Heroes Telangana Slang You Liked The Most?

సినీ పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఆ ట్రెండ్ ను ఫాలో అవుతుంటూ సినిమాలు తీసుకుంటూ వెళుతుంటారు. మొన్నామధ్య వరకూ బయోపిక్ ల హంగామా నడిచింది. ఇంకా ఆ హవా తగ్గలేదనుకోండి. ఇప్పుడు మరో ట్రెండ్ నడుస్తోంది. అదే తెలంగాణ స్లాంగ్. ఇంతకుముందు కూడా ఈ స్లాంగ్ వాడేవళ్లు కానీ.. చాలా తక్కువ.. అక్కడక్కడ ఉపయోగించేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ స్లాంగ్ ను బేస్ చేసుకొనే సినిమాలు తీసేస్తున్నారు. ఇటీవల ఈ స్లాంగ్ బేస్ చేసుకొని వచ్చి హిట్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. అవేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి చూపులు నినిమాలో ప్రియదర్శి, అర్జున్ రెడ్డి సినిమాలో రాహుల్ రామకృష్ణ, ఫలక్ నుమా దాస్ సినిమాలో విశ్వక్ సేన్, ఎఫ్ 2 సినిమాలో వరుణ్ తేజ్, దొరసాని సినిమాలో ఆనంద్ దేవరకొండ ఇటీవల వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ ఈ యాసలో మాట్లాడి ప్రేక్షకులను అలరించారు.. విజయ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… బేసిగ్గా ఇక్కడి వాడు కాబట్టి తెలంగాణ యాసలోనే మాట్లాడతాడు..

ఇక హీరోయిన్లు కూడా ఈ మధ్య ట్రై చేస్తున్నారు. ఫిదా లో బాన్సువాడ భాగమతి రోల్ లో సాయిపల్లవి తెలంగాణ మాట్లాడిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా నటేష్ కూడా ఇదే స్లాంగ్ లో మాట్లాడి సందడి చేసింది.

నిజానికి ఈ స్లాంగ్ లో మాట్లాడటం కొంచెం కష్టమైన పనే. అలాంటి స్లాంగ్ ను మన హీరోలు చాలా ఈజ్ గా మాట్లాడి ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరి తెలంగాణ స్లాంగ్ లో ఏ హీరో బాగా మాట్లాడాడు.. మీకు ఏ హీరో మాట్లాడిన విధానం నచ్చిందో మీ ఓటు ద్వారా తెలపండి.

తెలంగాణ స్లాంగ్ మీరు మెచ్చిన హీరో..?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here