బాలీవుడ్ లో కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలెంటెడ్ యాక్ట్రెస్ టాప్ లిస్ట్ లో ఆమె ఒకరు. ఇక తను సినిమాలతో వార్తల్లో ఎలా నిలిస్తుందో.. వివాదలతో అంతకంటే ఎక్కువ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ మధ్య కాలంలో అది మరీ ఎక్కువైపోయి..ఆఖరికి జర్నలిస్టులు బ్యాన్ చేసే వరకూ వచ్చింది పరిస్థితి. ఇక కంగనా సోదరి రంగోలి కూడా ఈమధ్య సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖుల వివాదాస్పద కామెంట్స్ చేసింది. ఇప్పటికే ఎంతో మందిని తన ట్వీట్లతో.. కామెంట్స్ తో టార్గెట్ చేసిన రంగోలి గతంలో తాప్సీపై కూడా అలాంటి కామెంట్సే చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కంగన సోదరి రంగోలీ.. తాప్సి గురించి కామెంట్ చేస్తూ.. ‘మీరు నా సోదరిని కాపీ కొట్టడం మానండి. మీరు చీప్ కాపీ’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రంగోలి తాప్సీపై చేసిన వ్యాఖ్యలకు పలువురు సినీ ప్రముఖులు తాప్సికి మద్దతుగా కూడా నిలిచారు. దీనిపై అనురాగ్ కశ్వప్ కు రంగోలికి మాటల యుద్దం కూడా నడిచింది.
కాగా తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న తాప్సీని దీనిపై అడగగా..కేవలం అనురాగ్ మాత్రమే కాదు.. ‘రంగోలీకి ఘాటుగా సమాధానం ఇవ్వాలని చాలా మంది నాతో అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. అయితే నెపోటిజం అనే కార్డ్ ను నాపై వాడలేరు.. ఎందుకంటే నేను ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి కష్టపడి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పింది. అంతేకాదు.. వారితే నేను మాటల యుద్దం చేయాలనుకోవడంలేదు.. వారి భాషతో నేను సరితూగలేను.. కంగనలాగే నాకూ రింగుల జుట్టు ఉంది. కేవలం కంగనాకు మాత్రమే కాపీ రైట్స్ ఉన్నాయన్న విషయం నాకు తెలియదు. ఒక విషయంలో మాత్రం నేనుసస్తీ కాపీనే (చీప్ వెర్షన్) కంగన ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరు. ఆమెతో పోలిస్తే నేను చీప్ వెర్షెనే అని కాస్త ఘాటుగానే స్పందించింది. మరి కంగనా సిస్టర్స్ ఇప్పటికైనా వేరే వాళ్లపై పదే పదే కామెంట్స్ చేయడం ఆపి… తమ పని తాము చేసుకుంటే బెటరేమో.. లేకపోతే ముందు ముందు ఇబ్బందికర సమస్యలు తలెత్తుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు….
[subscribe]
[youtube_video videoid=SFDOPGipFPQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: