టాలీవుడ్‌కి అచ్చొచ్చే నెలల్లో జూలై ఒకటి. ముఖ్యంగా… ఈ నెలలో వేర్వేరు సంవత్సరాల్లో పలు ఇండస్ట్రీ హిట్స్ (`బొబ్బిలిపులి`(1982), `ఇంద్ర`(2002), `సింహాద్రి`(2003), `మగధీర`(2009), `బాహుబలి – ది బిగినింగ్`(2015)) నమోదైన వైనం ఉంది. ఇక గత ఐదేళ్ళుగా అయితే వరుసగా ఘనవిజయాలు నమోదవుతున్నాయి. `దృశ్యం` (2014), `బాహుబలి – ది బిగినింగ్` (2015), `పెళ్ళిచూపులు` (2016), `ఫిదా` (2017), `ఆర్ ఎక్స్ 100` (2018)… ఇలా గత ఐదేళ్ళలో ఏడాదికో ఘనవిజయం ఉంటే… ఈ సంవత్సరం ఆ సెంటిమెంట్‌ని కొనసాగిస్తూ ఏకంగా రెండు బ్లాక్‌బస్టర్స్ నమోదయ్యాయి. ఆ సినిమాలే `ఓ బేబీ`, `ఇస్మార్ట్ శంకర్`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సమంత ప్రధాన పాత్రలో నటించిన `ఓ బేబీ` జూలై 5న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే… రామ్ హీరోగా తెరకెక్కిన `ఇస్మార్ట్ శంకర్` ఈ గురువారం (జూలై 18) రిలీజై బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. మొత్తానికి… వరుసగా ఆరోసారి కూడా జూలై నెలలో బ్లాక్‌బస్టర్స్ నమోదు కావడంతో… టాలీవుడ్‌లో `జూలై` సెంటిమెంట్ బలపడింది. ఇక నెక్ట్స్ వీక్ రిలీజ్ `డియర్ కామ్రేడ్` కూడా ఈ పరంపరని కొనసాగిస్తే…. ఈ ఏడాది జూలై మరింత ప్రత్యేకం అవుతుంది. అన్నట్టు… `జూలై మంత్ స్పెషలిస్ట్` యస్.యస్.రాజమౌళి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్` కూడా వచ్చే ఏడాదిలో జూలై నెలలోనే (జూలై 30న) రిలీజ్ కాబోతోంది. అంటే… వరుసగా ఏడోసారి కూడా జూలై నెలలో బ్లాక్‌బస్టర్ నమోదు కాబోతుందన్నమాట.
[youtube_video videoid=XBrORKG0lUw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: