తమన్నా ప్రధాన పాత్రలో రూపొందుతున్న తమిళ చిత్రం `పెట్రోమ్యాక్స్`. `అదే కన్‌గళ్` (`నీవెవరో`కి మాతృక) ఫేమ్ రోహన్ వెంకటేషన్ దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్… తెలుగు చిత్రం `ఆనందో బ్రహ్మ` (2017) ఆధారంగా తెరకెక్కుతోందని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని తాజాగా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఫస్ట్ లుక్‌లో… గదిలోని వస్తువులు, తలుపు దగ్గర ఉన్న మనుషులు తలక్రిందులుగా ఉంటే… తమన్నా మాత్రం కుర్చీలో చాలా కంఫర్ట్‌బుల్‌గా కూర్చుని చిరునవ్వులు చిందుస్తూ కనిపిస్తోంది. మరి… ఫస్ట్‌లుక్‌తో ఆకట్టుకున్న `పెట్రోమ్యాక్స్`…. బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా, తెలుగులో తమన్నా నటించిన తాజా చిత్రాలు `సైరా నరసింహారెడ్డి`, `దటీజ్ మహాలక్ష్మి` విడుదలకు సిద్ధమయ్యాయి.
Thank you so much my Kaaajjuuuu 😘😘🤗🤗#PetroMax
@EaglesEyeProd @rohinv_v @iYogiBabu @kaaliactor @tsk_actor @premkumaractor @GhibranOfficial @DaniRaymondJ @leojohnpaultw @meevinn @onlynikil @DoneChannel1 @thinkmusicindia https://t.co/OlDysii5Wl— Tamannaah Bhatia (@tamannaahspeaks) July 19, 2019
[youtube_video videoid=Fq-4d3hXTPw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: